గురువారం 04 జూన్ 2020
Telangana - May 01, 2020 , 13:51:31

మా ప్రభుత్వం రైతుల పక్షపాతి : మారెడ్డి

మా ప్రభుత్వం రైతుల పక్షపాతి : మారెడ్డి

హైదరాబాద్‌ : తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్ది శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో మిల్లర్లతో రాజకీయ నేతలు కుమ్మక్కయ్యారనే విమర్శలు సరికాదన్నారు. మీడియా ద్వారా మారెడ్డి మాట్లాడుతూ... ఈ యాసంగిలో 40 లక్షల ఎకరాల్లో పంట దిగుబడి వస్తుందన్నారు. రైతుకు మనోధైర్యం ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ చెప్పారన్నారు. ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లోనే తాలు సమస్య ఉందన్నారు. ధాన్యం కొనుగోలుపై అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తుందన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఎవరూ అధైర్యపడవద్దొన్నారు. ఎన్ని వేల కోట్లు ఖర్చయినా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులున్న మాట వాస్తవమని, వాటిని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.


logo