మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Feb 20, 2020 , 01:29:04

కమలనాథుల్లో కలవరం

కమలనాథుల్లో కలవరం
  • వివాదాస్పద వ్యాఖ్యలతో అభాసుపాలవుతున్న బీజేపీ
  • వివరణ ఇచ్చుకోలేక.. మౌనమే నా భాష అంటున్న కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లేయకుంటే తెలంగాణను తీస్కపోయి మళ్లీ ఆంధ్రల కలుపుతం..’ వంటి వివాదాస్పద, తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ నేత లు కేరాఫ్‌గా ఉండేవారు. వారికంటే తామేం తక్కువ తిన్నామన్నట్టు బీజేపీ నేతలు కూడా వారి సరసన నిలుస్తున్నారు. ఇందుకు తాజా గా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి చేసిన ‘ఎర్రబస్సు’ వ్యాఖ్యలే నిదర్శనం. ము ఖ్యంగా తెలంగాణ ప్రజలన్నా.. ఇక్కడి ప్రజల మనోభావాలన్నా.. గౌరవంలేని ఈ ఢిల్లీ పార్టీలకు ఇదో ఆనవాయితీగా మారింది. అందుకే ఎర్రబస్సు వ్యాఖ్యలుచేసి రెండురోజులవుతు న్నా కనీసం తెలంగాణ సమాజానికి వివరణ ఇచ్చుకోలేని, ఇవ్వడం ఇష్టంలేని, మౌనంగా ఉన్న దీనస్థితిలో కిషన్‌రెడ్డి కొట్టుమిట్టాడుతున్నారని ఆ పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు.  ఇలాంటి పరిణామాలు ఆ పార్టీలో కలవరానికి గురిచేస్తున్నాయి. అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయం అంటూ ప్రకటనలుచేసే నేతలేనా ఇలాంటి వ్యాఖ్యలు చేసేది? అంటూ సొంతగూటిలో మంటలు రేగుతున్నాయి.


డైలమాలో బీజేపీ నాయకులు

బీజేపీ నేతలంతా ఇప్పుడు డైలమాలో పడ్డారు. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు కాచుకొని కూర్చున వారు.. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలతో తామే గోతిలో పడ్డటయింది. ఇప్పటికే బీజేపీ పార్లమెంట్‌ మినహా వరుస ఎన్నికల్లో చావు తప్పినట్టు ఎం తోకొంత ఓట్లు రాబట్టుకున్నప్పటికీ ఎక్కడా కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోతున్నది. ఈ సమయంలో కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎలా సమర్థించుకోవాలో తెలియక తలపట్టుకొంటున్నారు. రాష్ట్ర అధ్యక్షుడితోపాటు నేతలెవ్వరూ ఈ ప్రకటనను సమర్థించుకొనే సాహసం చేయడంలేదు. 


గతంలో ప్రచారంపై మండిపాటు

ఇటీవల ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ రాష్ర్టానికి వచ్చినప్పుడు ఎంపీలు అర్వింద్‌, బాపూరావుతోపాటు కొత్తగా బీజేపీలో చేరిన కొందరు నేతలు ఆరెస్సెస్‌ యూనిఫాంలో హల్‌చల్‌చేశారు. దీనిపై ఆరెస్సెస్‌ వర్గాలు తీవ్ర అభ్యంత రం వ్యక్తంచేశాయి. గతంలో ఇలాంటి సంస్కృ తి పార్టీలో లేదని, ఆరెస్సెస్‌ కార్యకర్తలు ఇలాం టి ఫొటోలతో సోషల్‌మీడియాకు ఎక్కలేదని, కొత్తగా పార్టీలోకి వచ్చి, ఆరెస్సెఎస్‌ సిద్ధాంతాలు తెలియనివారు ఇలాంటి ప్రచారం చేసుకోవడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. కేంద్ర బడ్జెట్‌, రైల్వేకు కేటాయింపులు వంటి అంశాల్లో రాష్ర్టాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నించిన బొక్కబోర్లా పడిన బీజేపీ అదే రైల్వే అంశంలో కిషన్‌రెడ్డి చెరుపుకోలేని వ్యాఖ్యలు చేసిన ఇరుక్కుపోయారు. ఈ వరుస పరిణామాలు కమలనాథుల్లో కలకలం రేపుతున్నాయి. 


తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకు

 కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి టీఆర్‌ఎస్వీ హితవు


ఉస్మానియా యూనివర్సిటీ: కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి నిజాలు మాట్లాడాలని టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండగాని కిరణ్‌గౌడ్‌ సూచించారు. ప్రధాని మోదీ మెప్పు కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకూడదని హితవుపలికారు. మోదీ పుట్టకముందే తెలంగాణలో రైల్వే వ్యవస్థ ప్రారంభమైందని, చరిత్రను వక్రీకరిస్తే చరిత్ర హీనుడిగా మిగలక తప్పదని హెచ్చరించారు. ఉస్మానియా వర్సిటీ లా కళాశాలలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోదీ రాకముందు తెలంగాణవాళ్లకు ఎర్రబస్సు తప్ప రైళ్లు తెలియదని కిషన్‌రెడ్డి మతితప్పి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చరిత్రను వక్రీకరించడం రాజకీయ లబ్ధి కోసం మతాల మధ్య చిచ్చు పెట్టినంత సులువుకాదన్నారు. తెలంగాణలో 1870లోనే రైల్వే వ్యవస్థ ఏర్పడిందని గుర్తుచేశారు. తెలంగాణ సమాజాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కిషన్‌రెడ్డి తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు. సమావేశంలో టీఆర్‌ఎస్వీ నాయకులు శ్రీమాన్‌, ప్రదీప్‌, మనోహర్‌, వీరబాబు, ఉదయ్‌, ముజాహిద్‌, నరేశ్‌, గోపి తదితరులు పాల్గొన్నారు.