శనివారం 30 మే 2020
Telangana - May 11, 2020 , 20:32:56

జూన్‌ 7 వరకు ఓయూ సెలవులు

జూన్‌ 7 వరకు ఓయూ సెలవులు

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం తన పరిధిలోని పీజీ కళాశాలలకు వేసవి సెలవుల షెడ్యూల్‌ను సోమవారం ప్రకటించింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో దేశవ్యాప్తంగా అన్నివిద్యాసంస్థలు మూతపడ్డాయి. గత 50 రోజులుగా ఏ ఒక్క విద్యాసంస్థలో తరగతులు నడవలేదు. దీంతో విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు తెలంగాణ చాన్స్‌లర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సూచనల మేరకు అన్ని కాలేజీల్లో ఆన్‌లైన్‌ తరగతులను ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రారంభించింది.

పీజీ కాలేజీలన్నీ మూతపడటంతో వేసవి సెలవుల షెడ్యూల్‌లో ఓయూ మార్పులు చేసింది. సాధారణంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వేసవి సెలవులు జూన్‌ ఒకటో తేదీ నుంచి మొదలై 30 వ తేదీ  వరకు ఉంటాయి. లాక్‌డౌన్‌ ఈ నెల 29 వరకు పొడగించడంతో ఇటీవల  జరిగిన డీన్స్‌, ప్రిన్సిపాల్స్‌, ఇతర అధికారుల సమావేశంలో వేసవి సెలవులను ముందుకు జరుపాలని నిర్ణయించారు. దాంతో వేసవి సెలవులను ఇవ్వాల్టి  నుంచి వచ్చే నెల ఏడో తేదీ వరకు ఉండేలా నిర్ణయం తీసుకొన్నారు. 


logo