ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 11 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ప్రీ పీహెచ్డీ (పీహెచ్డీ కోర్స్ వర్క్) పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రీ పీహెచ్డీ బ్యాక్లాగ్ (వన్‌టైం చాన్స్ అండ్ ఫైనల్ చాన్స్) పరీక్షలను ఈ నెల 21వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.