బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 11, 2020 , 19:43:00

ఓయూ బీఈ, బీసీఏ, బి.ఫార్మా పరీక్షలు వాయిదా

ఓయూ బీఈ, బీసీఏ, బి.ఫార్మా పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌ : ఈ నెల 15, 16వ తేదీన జరగాల్సిన బ్యాచిలర్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, బీసీఏ, బి.ఫార్మా, బీహెచ్‌ఎంసీటీ, బీసీటీసీఏ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉస్మానియా యునివర్సిటీ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. పరీక్ష తేదీలను తిరిగి త్వరలోనే ప్రకటిస్తామంది. కాగా మిగతా పరీక్షలు నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్‌ 17నే యథావిధిగా జరగనున్నట్లు పేర్కొంది.


logo