మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 08, 2020 , 10:51:16

19 నుంచి ఓయూ పీజీ సెమి‌స్టర్స్‌

19 నుంచి ఓయూ పీజీ సెమి‌స్టర్స్‌

హైద‌రాబాద్ : ఉస్మా‌నియా యూని‌వ‌ర్సిటీ పరి‌ధి‌లోని అన్ని పీజీ కోర్సుల పరీక్ష తేదీ‌లను ఖరా‌రు ‌చే‌సి‌నట్టు ఓయూ కంట్రో‌లర్‌ ఆఫ్‌ ఎగ్జా‌మి‌నే‌షన్స్‌ ప్రొఫె‌సర్‌ శ్రీరాం వెంక‌టేశ్‌ బుధ‌వారం ఒక ప్రక‌ట‌నలో తెలి‌పారు. అన్ని పీజీ కోర్సుల నాలుగో సెమి‌స్టర్‌ రెగ్యు‌లర్‌, బ్యాక్‌‌లాగ్‌, ఇంప్రూ‌వ్‌‌మెంట్‌ పరీ‌క్ష‌లను ఈ నెల 19 నుంచి నిర్వ‌హిం‌చ‌ను‌న్నట్టు పేర్కొ‌న్నారు. పరీ‌క్షల మార్గ‌ద‌ర్శ‌కా‌లను సైతం జారీ‌చే‌సి‌నట్టు వెల్ల‌డిం‌చారు. విద్యా‌ర్థుల వెసు‌లు‌బాటు కోసం ఓయూ పరి‌ధి‌దాటి మిగి‌లిన జిల్లా‌కేం‌ద్రాల్లో కూడా పరీక్షా కేంద్రా‌లను ఏర్పాటు చేసి‌నట్టు తెలి‌పారు. వర్సిటీ వెబ్‌‌సై‌ట్‌‌లోకి వెళ్లి పరీక్ష కేంద్రాన్ని ముందుగా ఎంపిక చేసు‌కో‌వా‌లని సూచిం‌చారు.


logo