శుక్రవారం 05 మార్చి 2021
Telangana - Feb 20, 2021 , 07:42:20

ఓయూ పరీ‌క్షా ‌తే‌దీలు ఖరారు

ఓయూ పరీ‌క్షా ‌తే‌దీలు ఖరారు

ఉస్మా‌నియా యూని‌వ‌ర్సిటీ, ఫిబ్ర‌వరి 19: ఉస్మా‌నియా యూని‌వ‌ర్సిటీ వివిధ కోర్సుల పరీక్షా తేదీ‌లను ఖరారు చేసి‌నట్లు కంట్రో‌లర్‌ ఆఫ్‌ ది ఎగ్జా‌మి‌నే‌షన్స్‌ శ్రీరాం వెంక‌టేశ్‌ ఒక ప్రక‌ట‌నలో తెలి‌పారు. బీఈ (ఏ‌ఐ‌సీ‌టీఈ) రెండో, నాలుగో సెమి‌స్టర్‌ బ్యాక్‌‌లాగ్‌, మూడో సెమి‌స్టర్‌ మెయిన్‌, బ్యాక్‌‌లాగ్‌, అయిదో సెమి‌స్టర్‌ మెయిన్‌, మొదటి సెమి‌స్టర్‌ బ్యాక్‌‌లాగ్‌ తది‌తర పరీ‌క్షలు వచ్చే నెల 30వ తేదీ నుంచి, బీఫా‌ర్మసీ పరీ‌క్షలు వచ్చే నెల 2వ తేదీ నుంచి నిర్వ‌హిం‌చ‌ను‌న్నట్లు పేర్కొ‌న్నారు. పరీక్షా తేదీల పూర్తి వివ‌రా‌లను ఓయూ వెబ్‌‌సైట్‌ www.osmania. ac.inలో అందు‌బా‌టులో ఉంచి‌నట్లు పేర్కొ‌న్నారు.

రీవా‌ల్యు‌యే‌ష‌న్‌కు దర‌ఖా‌స్తుల ఆహ్వానం

ఎంఈ పరీక్షా ఫలి‌తాల రీవా‌ల్యు‌యే‌ష‌న్‌కు దర‌ఖా‌స్తు‌లను స్వీక‌రి‌స్తు‌న్నారు. అన్ని విభా‌గా‌లకు చెందిన ఎంఈ కోర్సు రెండో సెమి‌స్టర్‌ మెయిన్‌, బ్యాక్‌‌లాగ్‌ పరీక్షా ఫలి‌తాల రీవా‌ల్యు‌యే‌ష‌న్‌కు ఈ నెల 25వ తేదీ‌లోగా, రూ.200 అప‌రాధ రుసు‌ముతో ఈ నెల 27వ తేదీ‌లోగా ఫీజును చెల్లించి దర‌ఖాస్తు చేసు‌కో‌వచ్చు.


VIDEOS

logo