మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 30, 2020 , 23:20:34

ఉస్మానియా టెక్నాలజీ-బిజినెస్ ఇంక్యుబేటర్ వెబ్ సైట్ ప్రారంభం

ఉస్మానియా టెక్నాలజీ-బిజినెస్ ఇంక్యుబేటర్ వెబ్ సైట్ ప్రారంభం

హైదరాబాద్ : ఉస్మానియా టెక్నాలజీ-బిజినెస్ ఇంక్యుబేటర్ (టీబీఐ) వెబ్‌సైట్ www.osmania.ac.in/tbi ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్న ఇంక్యుబేటర్ నిర్వహించిన వెబ్‌నార్ సందర్భంగా గురువారం ప్రారంభించారు. వెబ్‌సైట్‌ను టెక్నికల్ అండ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ ప్రారంభించారు.

వెబ్‌సైట్ టీబీఐ కి సంబంధించిన సమగ్ర వివరాలను అందిస్తుంది. ఇంక్యుబేషన్ కోసం దరఖాస్తు చేసే విధానం, వ్యవస్థాపకులు, విద్యార్థులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులకు వారి ఆలోచనలను శక్తివంతమైన వ్యాపార నమూనాలలో పెంపొందించడానికి ఎంతో విలువైనదిగా ఉంటుందని ఇంక్యుబేటర్ ఇంచార్జ్ డైరెక్టర్ డాక్టర్ సీ శ్రీనివాసులు చెప్పారు.

 విశ్వవిద్యాలయ విద్యార్థులు, అధ్యాపక సభ్యులు మరియు పూర్వ విద్యార్థులు వ్యాపార సంస్థలలో పరిశోధన-ఆధారిత ఆలోచనలను నిర్వహించడానికి ఇంక్యుబేటర్ను సద్వినియోగం చేసుకోవాలని ఇంక్యుబేటర్ సీఈవో ప్రొఫెసర్ ఎస్ రామచంద్రమ్ కోరారు. ఈ సందర్భంగా ఉస్మానియా టీబీఐ సలహాదారు వర్లా భాణురెడ్డి ‘విశ్వవిద్యాలయ విద్యార్థులలో ఆవిష్కరణ, వ్యవస్థాపకత సామర్థ్యాన్ని అన్లాక్ చేయడం’ అనే వెబ్‌నార్‌ను నిర్వహించారు.


logo