బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 08, 2020 , 15:59:42

ఉస్మానియా ఆస్ప‌త్రి సూప‌రింటెండెంట్ కు క‌రోనా పాజిటివ్

ఉస్మానియా ఆస్ప‌త్రి సూప‌రింటెండెంట్ కు క‌రోనా పాజిటివ్

హైద‌రాబాద్ : ఉస్మానియా జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్ సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ బీ నాగేంద‌ర్ కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌ని ఓ రోగికి వైద్యం చేసిన స‌మ‌యంలో డాక్ట‌ర్ నాగేంద‌ర్ కు క‌రోనా సోకిన‌ట్లు నిర్ధారించారు. ప్ర‌స్తుతం డాక్ట‌ర్ ఐసోలేష‌న్ లో ఉన్నారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంది. ఉస్మానియా ఆస్ప‌త్రిలో క‌రోనా రోగుల‌కు వైద్యం కొన‌సాగుతున్న విష‌యం విదిత‌మే.

అయితే డాక్ట‌ర్ నాగేంద‌ర్.. గ‌చ్చిబౌలిలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్(టిమ్స్)కు సంబంధించిన ప‌నుల‌ను పూర్తి చేయ‌డంలో బిజీగా ఉన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వ వైద్యుల సంఘంలో సీనియ‌ర్ స‌భ్యులుగా నాగేంద‌ర్ కొన‌సాగుతున్నారు.  


logo