శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 02:57:21

ఉస్మానియాలో వాననీటి కాలువ!

ఉస్మానియాలో వాననీటి కాలువ!

  • నిజాంకాలంలో రాతితో కట్టినట్టు గుర్తింపు 
  • పేరుకుపోయిన చెత్తాచెదారం తొలిగింపు 
  • నీరు సాఫీగా వెళ్లేలా క్యాచ్‌పిట్ల నిర్మాణం

అబిడ్స్‌: ఇటీవల ఉస్మానియా దవాఖానలోకి వాననీరు చేరడానికి కారణమైన కాలువను అధికారులు గుర్తించారు. ఆ కాలువ నిజాం కాలంలో రాతితో కట్టినట్టు తేల్చారు. అధికారులు ఈ నాలాబ్లాక్‌ అయిన ప్రాంతాన్ని గుర్తిం చి చెత్తాచెదారాన్ని తొలిగించారు. నీరు సాఫీగా వెళ్లేలా రాతికట్టడాన్ని పెంచి క్యాచ్‌పిట్లను ఏర్పాటుచేస్తున్నారు. నిజాంకాలంలో వాననీటి కోసం కట్టిన ఈ కాలువకు దవాఖాన పరిసర ప్రాంతాలవారు డ్రైనేజీ లైన్లను సైతం కలిపారు. దీంతో సాధారణ సమయాల్లోనూఈ కాలువ పొంగిపొర్లుతున్నది. జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ ఈఈ ప్రకాశం నేతృత్వంలో అధికారులు మంగళవారం దవాఖానలోని ఈ కాలువను గుర్తించి పైకప్పు తీసి చెత్తాచెదారాన్ని తొలిగించారు. అనంతరం కాలువపై క్యాచ్‌ పిట్‌ నిర్మాణపనులు ప్రారంభించారు. కాలువ ఎక్కడ బ్లాక్‌అయ్యిందో గుర్తించేందుకు శ్రమించాల్సి వచ్చిందని, చెత్తను తొలిగించి, నీరు సాఫీగా వెళ్లేలా రాతి కట్టడాన్ని పెంచి క్యాచ్‌పిట్లను ఏర్పాటుచేస్తున్నామని జీహెచ్‌ఎంసీ ఎస్‌ఈ సహదేవ్‌ రత్నాకర్‌ తెలిపారు. పనులను ఉస్మానియా ఇంచార్జి సూపరింటెండెంట్‌ పర్యవేక్షించారు. త్వరితగతిన పనులు పూర్తిచేయాలని టీఎస్‌ఎంఐడీసీ అధికారులకు సూచించారు.

తాజావార్తలు


logo