శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 02:57:21

ఉస్మానియా కొత్త భవనం నిర్మించాలి

ఉస్మానియా కొత్త భవనం నిర్మించాలి

  • నిర్మాణ పనులు ప్రారంభమయ్యే వరకు నిరసనలు
  • వైద్యుల సంఘం జేఏసీ చైర్మన్‌ డాక్టర్‌ బొంగు రమేశ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/సుల్తాన్‌బజార్‌: ఉస్మానియా దవాఖాన  కూలిపోయేదశకు చేరుకున్నదని, ప్రభుత్వం కొత్త భవ నం నిర్మించాలని వైద్యుల సంఘం జేఏసీ, తెలంగాణ మెడికల్‌ అం డ్‌ హెల్త్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం విజ్ఞప్తిచేశాయి. మేధావులు, ప్రతిపక్షాలు నూతన భవన నిర్మాణానికి అడ్డుపడవద్దని ముక్తకంఠంతో వేడుకున్నాయి. కొత్త భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యేవరకు వైద్య ప్రజారోగ్య, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిత్యం గంటపాటు నిరసన వ్యక్తంచేస్తామని మంగళవారం ఉస్మానియా వైద్యులు ప్రకటించారు. చార్మినార్‌, గోల్కొండ తరహాలో ఉస్మానియా దవాఖాన భవనాన్ని హెరిటేజ్‌ పరిధిలో చూడవద్దని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ జేఏసీ చైర్మన్‌ డాక్టర్‌ బొంగు రమేశ్‌ విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో టీజీడీఏ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రఘు, కోశాధికారి డాక్టర్‌ శేఖర్‌, డాక్టర్‌ ఎండీ గౌస్‌, డాక్టర్‌ ప్రతిభాలక్ష్మి, డాక్టర్‌ వైభవ్‌, తెలంగాణ ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం హెచ్‌ యూనియన్‌ కార్యదర్శి కే రాములుగౌడ్‌, రవి, అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు. కరోనా సోకిన గెజిటెడ్‌ అధికారులకు నిమ్స్‌ దవాఖానలో చికిత్స అందించాలని తెలంగాణ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు జూపల్లి రాజేందర్‌ కోరారు.  


logo