సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 15:04:13

పాలమూరులో ప్రతిపపక్షాలకు చోటు లేదు : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

పాలమూరులో ప్రతిపపక్షాలకు చోటు లేదు : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

మహబూబ్ నగర్ : రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ఘన విజయం సాధించిందని, ఎక్కడోచోట ప్రతిపక్షాల నుంచి గెలిచిన వారు సైతం అభివృద్ధి కోసం అధికార పార్టీలో చేరుతున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. పాలమూరులో ప్రతిపక్షాల నుంచి అధికార పార్టీలోకి వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నదన్నారు. తద్వారా ప్రతిపక్షాలు పూర్తిగా ఖాళీ అవుతున్నాయన్నాని పేర్కొన్నారు. భూత్‌పూర్‌ మున్సిపాలిటీ 5వ, వార్డుకు చెందిన బీజేపీ కౌన్సిలర్‌ కృష్ణవేణితో ఆ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు మంత్రి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ల లో  చేరారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామ పంచాయతీగా ఉన్న భూత్‌పూర్‌ను మున్సిపాలిటీగా మార్చి అభివృద్ధి చేస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ సర్కార్ సొంతమన్నారు. తాగునీటికి ఇబ్బంది పడిన జనానికి నిత్యం మిషన్‌ భగీరథ ద్వారా శుద్ధమైన జలాన్ని అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మున్సిపాలిటీల సమగ్రాభివృద్ధికి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.logo