మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Oct 20, 2020 , 15:27:53

ప్రతిపక్షాలు బాధ్యతతో వ్యవహరించాలి : మంత్రి తలసాని

ప్రతిపక్షాలు బాధ్యతతో వ్యవహరించాలి : మంత్రి తలసాని

హైదరాబాద్‌ : విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్షాలు బాధ్యతతో వ్యవహరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. మంగళవారం అమీర్‌పేట డివిజన్‌లోని వరద బాధితులకు ఆయన ప్రభుత్వం తరఫున చెక్కులు అందజేసి మాట్లాడారు. ప్రజల కోసం ఇంత వేగంగా స్పందించిన సీఎం ఎవరూ లేరని, ప్రకృతి విపత్తుతో నష్టపోయిన వారిని ఇంతవేగంగా ఆదుకున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని పేర్కొన్నారు.

వరదల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ అండగా నిలుస్తుందని, ఎవరూ అధైర్యపడొద్దని చెప్పారు. సమయం, సందర్భం లేకుండా ప్రతిపక్షాలు ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటే ప్రజలే బుద్ధి చెబుతున్నారని అన్నారు. మరో రెండురోజులు హైదరాబాద్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులను సంప్రదించాలని సూచించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.