శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 03, 2020 , 13:24:13

ప్రతిపక్ష నేతలకూ రైతుబంధు డబ్బులు అందాయి : మంత్రి నిరంజన్‌రెడ్డి

ప్రతిపక్ష నేతలకూ రైతుబంధు డబ్బులు అందాయి : మంత్రి నిరంజన్‌రెడ్డి

వనపర్తి : రైతుబంధు రాదని చెప్పిన ప్రతిపక్ష నేతలకూ రైతుబంధు డబ్బులు అందాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం పాలెం గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి మంత్రి నేడు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి, కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతాంగం సంతోషంగా ఉన్నారన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగిస్తోందన్నారు. 

55 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అయినట్లు తెలిపారు. ఇంకా ఎవరికైనా రైతుబంధు అందని వారు అధికారులను సంప్రదించాల్సిందిగా సూచించారు. కాళేశ్వరం కాలువకు గండి పడితే ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని విమర్శించారు. రైతులకు జరుగుతున్న మేలును ప్రతిపక్షాలు గుర్తించడం లేదన్నారు. మీ హాయంలో సాగునీరు ఏపాటి ఇచ్చారో గుర్తుచేసుకోవాలని పేర్కొన్నారు.
logo