శనివారం 30 మే 2020
Telangana - May 17, 2020 , 13:00:15

పోతిరెడ్డిపాడుపై మాట్లాడే అర్హత ప్రతిపక్షాలకు లేదు

పోతిరెడ్డిపాడుపై మాట్లాడే అర్హత ప్రతిపక్షాలకు లేదు

హైదరాబాద్‌ : పోతిరెడ్డిపాడుపై ప్రతిపక్షాలు చేస్తు్న్న విమర్శలు అర్థరహితమని, పోతిరెడ్డిపాడును బయట పెట్టిందే టీఆర్ఎస్‌ పార్టీ అని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్‌ అన్నారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్, బీజేపీలు నీతులు చెప్పే అర్హత లేదన్నారు. పోతిరెడ్డిపాడుకు వ్యతికరేకంగా ఉద్యమం చేసింది టీఆర్‌ఎస్‌ పార్టీయేనని, ఇప్పుడు ప్రశ్నిస్తున్న వారు అప్పుడు మంత్రులుగా ఉండి ఏం చేశారన్నారు. పోతిరెడ్డిపాడును తవ్వింది నాటి వైఎస్‌ రాజశేఖర్‌డ్డి కాదా అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం నిరంతరం పోరాడే ఏకైక పార్టీ టీఆర్‌ఎస్ మాత్రమేనని అన్నారు.


logo