శనివారం 11 జూలై 2020
Telangana - Jun 14, 2020 , 14:57:39

ఉనికి కోసమే ప్రతిపక్షాల ఆరాటం : మంత్రి సత్యవతి రాథోడ్

ఉనికి కోసమే ప్రతిపక్షాల ఆరాటం : మంత్రి సత్యవతి రాథోడ్

మహబూబాబాద్ :టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పనిగట్టుకొని అసత్యపు ఆరోపణలు చేస్తున్నాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. జిల్లాలోని డోర్నకల్ నియోజకవర్గంలో రేషన్ కార్డు లేని నిరుపేదలకు మంత్రి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంటే ప్రతిపక్షాలు కళ్లున్న కబోదుల్లా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తమకు మనుగడ లేదని బెంబేలెత్తుతున్నాయన్నారు.

పచ్చకామెర్లు ఉన్న వారికి లోకమంతా పచ్చగా ఉన్నట్లు.. ఆనాడు జలయజ్ఞం పేరిట వారు చేసిన పాపాలు మిగిలిన వారు చేస్తున్నట్లు వారికి కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. కరోనా కష్ట కాలంలో ప్రజలను పట్టించుకోకుండా, ఇప్పుడు కొవిడ్ పరీక్షలు చేయడం లేదని పసలేని వాదనలు వినిపిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రజాదరణ లేక ఉనికి కోల్పోతున్న ప్రతిపక్షాలు, ఉనికిని కాపాడుకునేందుకే ప్రభుత్వంపై చిల్లర ఆరోపణలు చేస్తున్నాయని ఘాటుగా విమర్శించారు.


logo