ఆదివారం 05 జూలై 2020
Telangana - Jul 01, 2020 , 11:04:33

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాన్ని వ్యతిరేకించండి : మిర్యాల రాజిరెడ్డి

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాన్ని వ్యతిరేకించండి : మిర్యాల రాజిరెడ్డి

పెద్దపల్లి : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాన్ని వ్యతిరేకించాల్సిందిగా టీబీజీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు రేపు జరిగే సమ్మెను దిగ్విజయం చేయాల్సిందిగా కోరారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణపై మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడమే ధ్యేయంగా మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం పనిచేసతుందన్నారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటు వేలాన్ని తిప్పికొట్టాల్సిందిగా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటే నిరవధిక సమ్మె మాత్రమే సరైన నిర్ణయమన్నారు.

కార్మికుల ఉద్యోగ భద్రతపై ఏ మాత్రం శ్రద్ధ ఉన్నా జాతీయ కార్మిక సంఘాలు నిరవధిక సమ్మెకు పిలుపునియ్యాలన్నారు. జాతీయ కార్మిక సంఘాలు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని ఇష్టానుసారం విమర్శిస్తున్నారు. కోల్‌ ఇండియాకు భిన్నంగా 18 రకాల హక్కులను సింగరేణి కార్మిక వర్గానికి ఇచ్చిన చరిత్ర తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానిదన్నారు. 10వ వేజ్‌ బోర్డు ద్వారా కార్మికులకు తీవ్ర నష్టం చేశారని విమర్శించారు. మీ ఒప్పంద నిర్ణయాలతో ఒక్కో కార్మికుడు ప్రతీ నెల రూ. 6 వేల నుంచి రూ. 12 వేల వరకు నష్టపోతున్నాడన్నారు.

ఎల్లవేళలా కార్మికవర్గం హక్కులకై పాటుపడే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఇచ్చిన ఒక రోజు సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో అయిలి శ్రీనివాస్‌ సత్యనారాయణరెడ్డి, ప్యారే మియా ప్రభాకర్‌ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శంకర్‌నాయక్‌, సత్యం బాణాకర్‌, సిరంగి శ్రీనివాస్‌, పైడిపల్లి ప్రభాకర్‌, కర్క శ్రీనివాస్‌, కొప్పుల స్వామి, బేతి చంద్రయ్య, కొంగర రవీందర్‌, శ్రీనివాస్‌, మల్లేష్‌, రవీందర్‌, రాజమల్లు, అంజయ్య, వెంకటేశ్వర్లు, సుధాకర్‌ పాల్గొన్నారు. 


logo