వికారాబాద్ : స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వారి ఆదేశాల అనుసారం వికారాబాద్ జిల్లాలో రెండు ఖేలో ఇండియా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయుటకు అవకాశం కల్పించడం జరుగుతుందని జిల్లా యువజన, క్రీడల అధికారి హన్మంత్‌రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. యువజన, క్రీడల మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం వారు శిక్షణ కేంద్రాలు ఖేలో ఇండియా పథకం ద్వారా ఏర్పాటు చేయుటకు నిర్ణయించిందన్నారు. ఇట్టి కేంద్రాలకు మొదటిసారి నిర్వహించు ఖర్చులు నిమిత్తం రూ. 5 లక్షలు, ప్రతి సంవత్సరం రూ. 5 లక్షలు నిర్వహణ, సీనియర్ క్రీడాకారుల జీత భత్యము, ఇతర ఖర్చుల నిమిత్తంత 4 సంవత్సరాల వరకు ఆర్థిక సహాయం చేయుటకు నిర్ణయించడం జరిగిందని తెలిపారు.
క్రీడాకరులు/ సంస్థల అర్హత
జాతీయ స్పోర్ట్స్ ఫెడరేషన్ వారి ద్వారా గుర్తింపు పొందిన సంస్థల నుంచి నిర్వహించబడిన జాతీయ స్థాయిలో సీనియర్ నేషనల్, ఖేల్ ఇండియా యూనివర్సిటీ పోటీల్లో పథకాలు సాధించినవారు అర్హులు. ఇవే కాకుండా అంతర్జాయ పోటీల్లో పాల్గొన్న వారు సైతం అర్హులని తెలిపారు. వయస్సు 40 సంవత్సరాలోపు ఉండాలన్నారు. ఇతర వివరాలకు ఫోన్ నం. 9966147294ను సంప్రదించాలన్నారు.