Telangana
- Dec 26, 2020 , 22:33:03
భగ్గుమన్న పగ.. దంపతులపై కత్తితో దాడి

మెదక్ : పాతకక్షల నేపథ్యంలో దంపతులపై ప్రత్యర్థి కత్తితో దాడి చేయంతో తీవ్ర గాయాలయ్యాయి. మెదక్ జిల్లా నిజాంపేటలో శనివారం రాత్రి ఈ ఘటన కలకలం సృష్టించింది. నిజాంపేటకు చెందిన బోయిన శ్రీనివాస్‌కు అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో పాతకక్షలున్నాయి. ఈ నేపథ్యంలో పగతో రగలిపోయిన అతడు శనివారం రాత్రి అదునుచూసి శ్రీనివాస్‌తోపాటు అతడి భార్య కనకవ్వపై కత్తితో దాడి చేశాడు. దాడిలో దంపతులిద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
MOST READ
TRENDING