e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home తెలంగాణ ప్రొక్టర్డ్‌ సాఫ్ట్‌వేర్‌తో జేఎన్టీయూ పరీక్షలు

ప్రొక్టర్డ్‌ సాఫ్ట్‌వేర్‌తో జేఎన్టీయూ పరీక్షలు

ప్రొక్టర్డ్‌ సాఫ్ట్‌వేర్‌తో జేఎన్టీయూ పరీక్షలు
  • వెబ్‌సైట్లేవీ ఓపెన్‌కావు!
  • కీబోర్డు, మౌస్‌ మాత్రమే పనిచేస్తాయి
  • వెబ్‌క్యామ్‌ నిఘాలో విద్యార్థులు, పక్కచూపులు చూస్తే డిబార్‌

హైదరాబాద్‌, మే 27 (నమస్తే తెలంగాణ ): జేఎన్టీయూ పరిధిలో తొలిసారి ప్రొక్టర్డ్‌ ఎగ్జామ్‌ సాఫ్ట్‌వేర్‌ సాయంతో పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఫైనల్‌ సెమిస్టర్‌ విద్యార్థులకు ఈ సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. జేఎన్టీయూ పరిధిలోని బీటెక్‌, బీఫార్మసీ విద్యార్థులకు జూన్‌ 14 నుంచి పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. బీటెక్‌లో మూడు సబ్జెక్టులు, ఫార్మసీలో 5 సబ్జెక్టులకు మాత్రమే పరీక్షలు జరగాల్సి ఉండటంతో వీలైనంత త్వరగా వాటిని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రక్రియ ఇలా..

  • పరీక్షరాసే విద్యార్థులు తొలుత ప్రొక్టర్డ్‌ ఎగ్జామ్‌ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.
  • విద్యార్థి ఐడీ వెరిఫికేషన్‌ పూర్తయిన తర్వాతే పరీక్షకు అనుమతిస్తారు.
  • నిజంగా విద్యార్థులే పరీక్ష రాస్తున్నారా? లేక మధ్యలో ఇతరులెవరైనా చేరారా అని తేల్చేందుకు ఫేస్‌ రికగ్నైజేషన్‌ టెక్నాలజీని వాడతారు.
  • పరీక్ష రాసేందుకు విద్యార్థి ఉపయోగించే కంప్యూటర్‌ను సర్వర్‌తో అనుసంధానం చేయగానే ఆ కంప్యూటర్‌లో మిగతా వెబ్‌సైట్లేవీ ఓపెన్‌ కావు. కేవలం కీబోర్డు, మౌస్‌ మాత్రమే పనిచేస్తాయి.
  • విద్యార్థి పక్క చూపులు చూసినా, కాపీయింగ్‌కు ప్రయత్నించినా సాఫ్ట్‌వేర్‌ హెచ్చరికలు జారీచేస్తుంది. దీంతో ఆ విద్యార్థులను డిబార్‌ చేస్తారు.
  • పరీక్ష రాసేవారు పూర్తిగా వెబ్‌క్యామ్‌ నిఘాలో ఉంటారు. వారిని ఇన్విజిలేటర్లు పర్యవేక్షిస్తుంటారు.
  • కావాలని చీట్‌ చేసేందుకు ప్రయత్నించినా, వేరే వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేసినా సదరు విద్యార్థిపై చర్యలు తీసుకుంటారు.
  • ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక్కో ఇన్విజిలేటర్‌ను నియమిస్తారు. ఒక కాలేజీ విద్యార్థులకు మరో కాలేజీ అధ్యాపకులను ఇన్విజిలేటర్లుగా నియమించి, పర్యవేక్షణ జరుపుతారు.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రొక్టర్డ్‌ సాఫ్ట్‌వేర్‌తో జేఎన్టీయూ పరీక్షలు

ట్రెండింగ్‌

Advertisement