శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 25, 2020 , 03:07:07

ఓపెన్‌ స్కూల్‌.. టెన్త్‌, ఇంటర్‌ అంతా పాస్‌

ఓపెన్‌ స్కూల్‌.. టెన్త్‌, ఇంటర్‌ అంతా పాస్‌

  • కొవిడ్‌-19 వ్యాప్తితో పరీక్షలు రద్దు  
  • పదిలో 43వేలు, ఇంటర్‌లో 32వేల మందికి లబ్ధి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించాల్సిన పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు పదోతరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలకు రిజిస్టర్‌ చేసుకున్న వారందరినీ పాస్‌ చేస్తూ శుక్రవారం విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పదో తరగతిలో 43 వేల మంది, ఇంటర్మీడియట్‌లో 32 వేల మంది విద్యార్థులు పాస్‌ అయ్యారని విద్యాశాఖ తెలిపింది. పాసైన వారందరికీ కనీసం 35 శాతం మార్కులు వేస్తున్నామని పేర్కొన్నది. ఆసక్తి ఉన్న విద్యార్థులు భవిష్యత్తులో నిర్వహించబోయే పరీక్షల్లో ఇంప్రూవ్‌మెంట్‌ రాసుకొనే అవకాశం కల్పిస్తామని తెలిపింది. ఒకేషనల్‌ కోర్సులు, ప్రాక్టికల్స్‌ పరీక్షల్లోనూ 35 శాతం మార్కులతో ఆందరిని పాస్‌ చేసినట్టు వివరించింది. 


logo