ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 06:42:47

ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు రద్దు!

ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు రద్దు!

  • ప్రభుత్వానికి అధికారుల ప్రతిపాదనలు

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని ఓపెన్‌ స్కూల్స్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలను రద్దుచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. ఈ నిర్ణయంతో టెన్త్‌లో 42 వేల మంది, ఇంటర్‌లో 33 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని రాష్ట్ర ఓపెన్‌ స్కూల్స్‌ సొసైటీ డైరెక్టర్‌ ఎస్‌ వెంకటేశ్వరశర్మ తెలిపారు. ప్రభుత్వం ఆమోదిస్తే వారంతా పాస్‌ అవుతారని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, ఆమోదం రావాల్సి ఉన్నదని చెప్పారు. 


logo