సోమవారం 25 మే 2020
Telangana - Mar 29, 2020 , 13:11:18

ఉదయం పూట ఫర్టిలైజర్ దుకాణాలు తెరవండి...

ఉదయం పూట ఫర్టిలైజర్ దుకాణాలు తెరవండి...

సంగారెడ్డి  : జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్షా సమావేశం నిర్వహిచారు.  కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌  జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్నది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో  తీసుకోవాలిసినా జాగ్రత్తలు పాటించవలసిన కఠినమైన నిర్ణయాలు సమావేశంలో చర్చించారు. సమీక్షా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, ఎంపీ.  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్, తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతు కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.  సంగారెడ్డి  జిల్లాలో ఒక్క కరోనా కేసు నమోదు కాకుండా చూద్దామని మంత్రి హరీశ్ రావు అధికారులను కోరారు. జిల్లా కలెక్టర్ నుంచి గ్రామస్థాయి అధికారి వరకు అప్రమత్తంగా పని చేయాలని కోరారు. ఇప్పటి వరకు అధికారులు, సిబ్బంది చక్కగా పని చేశారు. ఇదే స్ఫూర్తిని చివరి వరకు కొనసాగిద్దామని సూచించారు. మున్సిపల్ కమిషనర్లు, చైర్మన్లు, కౌన్సిలర్లు, గ్రామ సర్పంచ్ లు, వార్డు మెంబర్లు అంతా అప్రమత్తంగా ఉండాలి.

ప్రజలకు కరోనా వైరస్ పై అవగాహన కల్పించాలన్నారు. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరూ రోడ్ల మీదకు రావొద్దని, రాత్రి వేళ్ళలో పారిశుద్ధ్య పనులు, నిత్యావసర వస్తువులు రవాణా జరిగేలా అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఏదైనా సాయం అవసరమైతే ప్రజలు 100 డయల్ చేయాలని కోరారు. కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు వహించాలని, మార్కెట్ల వద్ద పర్యవేక్షణకు అధికారులకు ఏర్పాటు చేయాలనీ, ధరల పట్టికను ప్రదర్శించాలని మంత్రి సూచించారు. జహీరాబాద్ విదేశాల నుంచి రాగా  వైద్య పరీక్షలు అనంతరం 14 రోజులు గడువు ముగిసిందని ఏలాంటి ఇబ్బందులు లేవని, మిగతా వారిని క్వారంటైనులో ఉంచామని మంత్రి తెలిపారు. విదేశాల నుంచి ఏవరైనా వచ్చారా.? ఇంకా ఏవరైనా ఉన్నారా..? అన్న అంశాలపై దృష్టి సారించాలని వైద్యాదికారులకు. అడిగి తెలుసుకొన్నారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చి హోం క్వారంటైన్‌లో ఉన్నవారిపై గట్టి నిఘా పెట్టాలని  ఉన్నవారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారి వివరాలు కూడా సేకరించాలన్నారు .

 మున్సిపల్, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులకు ఆటంకం కలగవద్దని, పారిశుద్ధ్య విధుల్లో పాల్గొనే వారికి మాస్కులు, గ్లౌసులు తప్పకుండా ఇవ్వాలని సూచించారు. ఒకదశలో ఎంత ఖర్చు అయినా  ఫర్వాలేదు మాస్కులు, గ్లౌసులు లేకుండా పని చేయవద్దని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను మంత్రి హెచ్చరించారు. ఎప్పటికప్పుడు మున్సిపల్ కమిషనర్లు, చైర్మన్లు శానిటరీ పనులను పర్యవేక్షించాలని సూచించారు. మున్సిపల్, గ్రామీణ ప్రాంతాల్లో శానిటైజేషన్ పనులు తప్పకుండా నిర్వహించాలి. ఎంత ఖర్చు అయినా ఫర్వాలేదు మాస్కులు గ్లౌసులు లేకుండా పని చేయొద్దు. విధులలో పాల్గొనే వారికి మాస్కులు, గ్లౌసులు తప్పకుండా ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కు మంత్రి ఆదేశించారు.. మండల స్థాయిలో పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రభుత్వ వైద్యులు ప్రతిరోజూ అన్నీ గ్రామాల సర్పంచ్ లతో మాట్లాడి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. గ్రామానికి ఎవరైనా కొత్త వారు వస్తే వివరాలు సేకరించాలన్నారు.

కరోనా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ సందర్భంగా   జిల్లాలో  నిత్యం సేవలు అందించే పారిశుద్ధ్య కార్మికులకు, వాటర్ సప్లయ్-తాగునీటి సరఫరా చేసే ఉద్యోగులు, విద్యుత్ సరఫరా చేసే ఉద్యోగులతో  రైతు లకు    డివిజన్ల పరిధిలోని ఆర్డీఓలు, డి స్ పి  లేదా జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులచే పాసులు ఇవ్వాలని సూచించారు.   మాస్కులు లేకుండా ఏ మున్సిపల్ ఉద్యోగి పని చేయొద్దని, వాటర్ లైన్ మేన్, విద్యుత్ లైన్ మేన్, పారిశుద్ధ్య కార్మికులు ఎవ్వరు కూడా ఇబ్బంది పడొద్దని సూచించారు. నిత్యం పట్టణాన్ని ఎంతో పరిశుభ్రంగా నిలువుతున్న పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు అందివ్వాలని జిల్లా కలెక్టర్,  మంత్రి ఆదేశించారు. ఇతర రాష్ర్టాల నుంచి రాష్ర్టానికి వచ్చే వాహనాలను పూర్తిగా నిషేధించనున్నారు. అత్యవసర సేవలు, నిత్యావసర సరుకులు, కూరగాయాలు, పాలు సరఫరా చేసే వాహనాలకు అనుమతులు  ఇవ్వాలన్నారు.రైతు లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని యూరియా షాప్ లు రోజు ఉదయం తీయాలని దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులకు ఆదేశించారు. రేపటి నుoచి శనిగలు కొనుగోలు ప్రారంభించాలని, అందుకు కావలసిన సంచులు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు   ప్రజలకు నిత్యావసరాలు పొందే షాపింగ్‌మాల్స్‌, కిరాణా, ఇతర దుకాణాలను ఎదుట ధరల పట్టికను తెలియచేయాలి అని అన్నారు   బ్లాక్‌మార్కెట్‌  లో  సామాన్య జనాన్ని ఇబ్బందులకు గురిచేసే చట్ట ప్రకారము కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 


logo