మంగళవారం 19 జనవరి 2021
Telangana - Jan 09, 2021 , 01:00:30

ఓపెన్‌ యాక్సెస్‌కు సింగరేణి విద్యుత్‌

 ఓపెన్‌ యాక్సెస్‌కు  సింగరేణి విద్యుత్‌

  • తెలంగాణ ట్రాన్స్‌కోతో ఒప్పందం

హైదరాబాద్‌, జనవరి 8(నమస్తే తెలంగాణ) : మణుగూరు ఏరియాలో సింగరేణి నెలకొల్పిన సౌర విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం నుంచి 30 మెగావాట్ల ఓపెన్‌ యాక్సెస్‌పై తెలంగాణ ట్రాన్స్‌కో, ఎన్పీడీసీఎల్‌, సింగరేణి మధ్య ఒప్పందం జరిగింది. హైదరాబాద్‌లోని విద్యుత్‌ సౌధలో శుక్రవారం మూడు సంస్థల అధికారులు ఒప్పం దం కుదుర్చుకున్నారు. మణుగూరు ప్లాంటుకు 25 ఏండ్ల్ల ఉత్పత్తి ప్రణాళిక ఉన్నప్పటికీ ప్రాథమికంగా రెండేండ్ల కోసమే ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించనున్నా రు. మణుగూరు ప్లాంటు ఏర్పాటు ద్వారా సొంత అవసరాలకు ఉపయోగించే విద్యుత్‌పై సింగరేణికి ప్రతినెల రూ. 1.20 కోట్లు ఆదా అవుతున్నాయి. కార్యక్రమంలో జీఎం నాగేశ్వరరావు, ఎస్‌ఈ సీహెచ్‌ ప్రభాకర్‌, టీఎస్‌ ట్రాన్స్‌కో సీఈ వివేకానంద, ఎస్‌ఈ కరుణాకర్‌, ఎన్పీడీసీఎల్‌ సీజీఎం మధుసూదన్‌రావు పాల్గొన్నారు. 

సీఎండీ పదవీ కాలం పెంపుపై ఐఎన్‌టీయూసీ హర్షం

సింగరేణి సీఎండీ శ్రీధర్‌ పదవీ కాలం పొడగింపుపై ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్‌ జనక్‌ప్రసాద్‌ హర్షం వ్యక్తంచేశారు. సీఎండీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సారథ్యంలో సింగరేణి మరిన్ని విజయాలు సాధించగలదని సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జక్కం రమేశ్‌, రాజశేఖర్‌రావు పేర్కొన్నారు.