గురువారం 09 జూలై 2020
Telangana - Jun 28, 2020 , 00:43:47

మంత్రి కేటీఆర్‌కు కాకతీయ హెరిటేజ్‌ పుస్తకం బహూకరణ

మంత్రి కేటీఆర్‌కు కాకతీయ హెరిటేజ్‌ పుస్తకం బహూకరణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కాకతీయుల కాలంనాటి ప్రత్యేకతలను వివరించే కాకతీయ హెరిటేజ్‌ పుస్తకాన్ని మంత్రి తారకరామారావుకు ఎం సీఆర్‌హెచ్చార్డీ డైరెక్టర్‌ జనరల్‌, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ బీపీ ఆచార్య బహూకరించారు. పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా పీవీ రచనలు, ఇతర సంకలనాలతో రూపొదించిన ఈ పుస్తకాన్ని శనివారం అందజేశారు. ఎంసీఆర్‌హెచ్చార్డీ ఆధ్వర్యంలో సెంటర్‌ ఫర్‌ తెలంగాణ స్టడీస్‌ పేరిట దీనిని పునఃప్రచురించినట్టు కేటీఆర్‌కు వివరించారు.logo