శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 03:12:46

ఆగస్టు తర్వాత కరోనా తగ్గుముఖం

ఆగస్టు తర్వాత కరోనా తగ్గుముఖం

  • షికాగో వర్సిటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ విజయ్‌ ఎల్డండి
  • మంత్రి ఈటల, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌తో భేటీ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశంలో ఆగస్టు తర్వాత కరోనావ్యాప్తి తగ్గుముఖం పడుతుందని అమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సభ్యుడు, చికాగో వర్సిటీ క్లినికల్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ విజయ్‌ ఎల్డండి పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్చార్డీలో ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్‌, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌తో ఆయన భేటీ అయ్యారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను మంత్రి ఈటల వివరించారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల స్థాయిలోనే కేసులు గుర్తించేందుకు కృషిచేస్తున్నట్టు వివరించారు. కరోనా కేసుల సంఖ్య ఆగస్టు వరకు పతాకస్థాయికి చేరుకొని.. తర్వాత తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నారు. 

కొవిడ్‌ను ఎదుర్కొనే సత్తా ఉంది: ఈటల

కొవిడ్‌ను ఎదుర్కొనే సత్తా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఊపిరితిత్తులు దెబ్బతిన్న వారికి మాత్రమే కరోనా ఇబ్బందిగా మారుతున్నదని, సాధారణ లక్షణాలు ఉన్నవారు సులువుగా అధిగమిస్తున్నారని తెలిపారు. అటు.. బుధవారం జిల్లా వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఈటల పలుసూచనలు చేశారు.


logo