బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 12:54:57

ఒక జంతువును మాత్రమే బలివ్వాలి.. మిగిలిన డబ్బు పేదలకు పంచాలి

ఒక జంతువును మాత్రమే బలివ్వాలి.. మిగిలిన డబ్బు పేదలకు పంచాలి

హైదరాబాద్‌ : బక్రీద్‌ పండుగకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ, ఆ రోజు ఏమి చేయాలనే దానిపై ముస్లింలలో గందరగోళం నెలకొంది. కరోనా కారణంగా ఈద్ కోసం పశువులను కొనుగోలు చేయడానికి ముస్లింలు భయపడవుతున్నారు. ఖుర్బానీ (మాంసం పంచడం) ఇవ్వకపోతే ఈద్‌ ఎలా జరుగుతుంది? అల్లాహ్‌ ఆదేశాలను ఎలా అనుసరిస్తాం? అని సందిగ్ధంలో పడ్డారు. 

జంతువులను బలి ఇవ్వకుండా వేరే ప్రత్యామ్నాయం లేదని, దానధర్మాలు చేసినప్పటికీ జంతువును బలి ఇచ్చినంత ధర్మం ఉండదని మత పెద్దలు అంటున్నారు. సూక్ష్మక్రిములు, వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఒంటె, ఆవు వంటి పెద్ద పశువులను బలి ఇవ్వొద్దని సూచిస్తున్నారు.

‘‘జంతువును త్యాగం చేయకుండా ప్రత్యామ్నాయం లేదు. కానీ తెలిసిన కసాయి, పరిశుభ్రమైన పరికరాలను మాత్రమే వాడాలి. ఒకటి కంటే ఎక్కువ జంతువులను త్యాగం చేసే కుటుంబాలన్నీ ఒకదాన్ని మాత్రమే బలివ్వాలని, మిగిలిన డబ్బును పేదలకు పంచాల’’ని జమాయతే అహ్లే హదీస్‌ ప్రతినిధి అన్నారు. 

ఇదిలా ఉండగా రెడ్‌ జోన్‌లో నివసిస్తున్నబంధువులు, పేదలకు మాంసం పంపిణీ చేయొద్దని, తెలిసిన వారు, సమీపంలో ఉన్నవారికి మాత్రమే పంపిణీ చేయాలని అఖిల భారత సున్నీ ఉలేమా బోర్డు అధ్యక్షుడు సయ్యద్ షా హమీద్ హుస్సియన్ షత్తారి అన్నారు. logo