శుక్రవారం 03 జూలై 2020
Telangana - May 29, 2020 , 23:41:20

రాజన్న ఆలయంలో ఆన్‌లైన్‌ పూజలకు ఆదరణ

రాజన్న ఆలయంలో ఆన్‌లైన్‌ పూజలకు ఆదరణ

వేములవాడ : వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల కోసం ఆన్‌లైన్‌ పూజలు కొనసాగుతున్నాయి. బుక్‌చేసుకున్న  భక్తులకు వారి గోత్రనామాల పేర ఆలయ అర్చకులు శుక్రవారం ఆలయ అద్దాలమండపంలో ప్రత్యేక పూజలు చేశారు. ఏప్రిల్‌ 19న ప్రారంభమైన ఆన్‌లైన్‌ పూజలతో 252 మంది భక్తులు వివిధ రకాల పూజలు నిర్వహించుకున్నారని, రూ.1,41,500 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఆలయంలోని అద్దాలమండపంలో అర్చకులు అభిషేక పూజలు, అన్నపూజలు, నాగిరెడ్డిమండపంలో అమ్మవారి వద్ద కుంకుమ పూజలు, కళాభవన్‌లో స్వామివారి నిత్యకళ్యాణం, సత్యనారాయణ వ్రతం, లింగార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌, దుమాల వాసు, గోపన్నగారి గణేశ్‌, చెల్లపెల్లి భాను, బుడెంగారి రాజు, తదితరులు ఉన్నారు.


logo