సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 24, 2020 , 23:55:54

అందుబాటులో ఆన్‌లైన్‌ డాక్టర్‌

అందుబాటులో ఆన్‌లైన్‌ డాక్టర్‌

  • ఇంటినుంచే సంప్రదించే అవకాశం 
  • ప్రారంభించిన యశోద హాస్పిటల్స్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆన్‌లైన్‌ వీడియో డాక్టర్‌ కన్సల్టేషన్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని యశోద హాస్పిటల్స్‌ ఎండీ డాక్టర్‌ జీఎస్‌రావు వెల్లడించారు. కరోనా నేపథ్యంలో ఈ సదుపాయాన్ని కల్పించామని మంగళవారం తెలిపారు. అత్యవసర వైద్య సలహాల కోసం తమ వైద్యులను ఆన్‌లైన్‌ వీడియో కన్సల్టేషన్‌ ద్వారా సంప్రదించవచ్చని చెప్పారు. డయాబెటిస్‌, కిడ్నీ, గుండె వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే రోగులకు స్థిరమైన సమీక్ష, వైద్యుల సలహా అవసరమన్న విషయాన్ని తాము అర్థం చేసుకున్నామని పేర్కొన్నారు. 

రోగులకు నిరంతరం మార్గనిర్దేశం చేయడానికి ఆన్‌లైన్‌ వైద్య సలహాలు, సూచనలు ఇస్తారని తెలిపారు. రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప రోగులు ఇల్లు వదిలి బయటకు రావద్దని చెప్పారు. ఆన్‌లైన్‌ కన్సల్టేషన్‌ పొందడానికి  www. yashodahospital.com వెబ్‌సైట్‌, లేదా 040-45674567 నంబర్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.


logo