శనివారం 06 జూన్ 2020
Telangana - May 01, 2020 , 15:07:32

మరో 7 ఆలయాల్లోనూ ఆన్‌లైన్‌ పూజలు

మరో 7 ఆలయాల్లోనూ ఆన్‌లైన్‌ పూజలు

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని పలు ప్రముఖ దేవాలయాల్లో ఆన్‌లైన్‌ పూజా సేవలను ప్రారంభించిన దేవాదాయశాఖ తాజాగా మరో 7 ఆలయాల్లోనూ ఆన్‌లైన్‌ ద్వారా పూజలు చేయించుకునే అవకాశం కల్పించింది. లాక్‌డౌన్‌ కాలంలో తమ ఇష్ట దైవాల సన్నిధికి వెళ్లి పూజలు చేయించుకోలేక పోతున్నాం అనే దిగులును తొలగించేందుకు దేవాదాయశాఖ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి, కొండగట్టు అంజన్న, భద్రాచలం రామయ్య, జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి, బాసర జ్ఞాన సరస్వతి, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాల్లో ఇప్పటికే ఆన్‌లైన్‌ పూజలు కొనసాగుతున్నాయి.

తాజాగా కాళేశ్వరం ముక్తేశ్వరస్వామి, తాడ్‌బండ్‌ ఆంజనేయస్వామి, జోగులాంబ, కీసర రామలింగేశ్వరస్వామి, శ్రీనగర్‌ కాలనీ వెంకటేశ్వరస్వామి, చెర్వుగట్టు రామలింగేశ్వర ఆలయం, జమలాపురం వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తెచ్చారు. మీ-సేవా పోర్టల్‌ ద్వారా భక్తులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వారా చేయాల్సిన పూజలను ఎంచుకోవచ్చన్నారు. భక్తుల పేరిట పూజలు చేసి వారి సెల్‌ఫోన్లకు సందేశం పంపుతామని ఆయన పేర్కొన్నారు.


logo