బుధవారం 03 జూన్ 2020
Telangana - May 21, 2020 , 21:00:21

భద్రకాళి దేవాలయంలో భక్తులకు ఆన్‌లైన్‌ సేవలు

భద్రకాళి దేవాలయంలో భక్తులకు ఆన్‌లైన్‌ సేవలు

వరంగల్‌ : కొవిడ్‌-19 వ్యాప్తిని నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌తో రెండు నెలలుగా రాష్ట్రంలోని దేవాలయాల్లో భక్తులకు దైవ దర్శనం నిలిపివేశారు. అయితే దేవాలయాల్లో సంప్రదాయం ప్రకారం నిత్యపూజలు, కైంకర్యాలు కొనసాగాయి. భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో మే 1 నుంచి దర్శన, వసతి, ఆర్జిత సేవలకు సంబంధించిన ఆన్‌లైన్‌ సేవలను దేవాదాయశాఖ ప్రారంభించింది. 

వరంగల్‌ భద్రకాళి దేవాలయంలో కుంకుమార్చన, అభిషేకం వంటి పూజలకు దాదాపు 50 మంది భక్తులు తమ పేర్లు, గోత్రాలకు సంబంధించి వివరాలను నమోదు చేసుకున్నట్లు ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు తెలిపారు. మీ సేవ, టీ యాప్‌ ఫోలియో ద్వారా నగదు చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకున్న భక్తుల పేర్లపై పూజలు నిర్వహించిన అనంతరం వారికి సంక్షిప్త సందేశం ద్వారా సమాచారం అందిస్తున్నామని చెప్పారు. అలాగే హన్మకొండలోని చారిత్రక వేయిస్తంభాల ఆలయంలో గోత్రనామాలు, అభిషేకం కోసం 50 మంది ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకున్నారని ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ చెప్పారు.


logo