మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 01, 2020 , 06:16:48

‘సిటిజన్‌ బడ్డి’యాప్‌తో ఆన్‌లైన్‌లో ఆస్తిపన్ను చెల్లింపు

‘సిటిజన్‌ బడ్డి’యాప్‌తో ఆన్‌లైన్‌లో ఆస్తిపన్ను చెల్లింపు

హైదరాబాద్ : ఆస్తిపన్ను మదింపు ప్రక్రియను ఆన్‌లైన్‌లో ప్రజలే స్వయంగా నిర్వహించేలా ప్రోత్సహించాలని సీడీఎంఏ డాక్టర్‌ ఎన్‌ సత్యనారాయణ మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. పట్టణప్రగతిలో భాగంగా ప్రతి మున్సిపాలిటీలో దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని శనివారం సూచించారు. తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019 ప్రకారం.. ఆస్తిపన్నును పౌరులు ఎవరికివారే ఆన్‌లైన్‌లో చెల్లించేలా కొత్తగా ‘సిటిజన్‌ బడ్డి’ యాప్‌ రూపొందించినట్టు తెలిపారు. సొంతంగా ఆస్తి మదింపుచేసే ప్రక్రియ అందుబాటులోకి వచ్చిందని, ఎవరైనా తప్పుగా పన్ను మదింపుచేస్తే 25 రెట్లు జరిమానా విధిస్తామన్నారు. 

ఒకేసారి వినియోగించే ప్లాస్టిక్‌ను నిషేధించాలి

పట్టణ ప్రగతిలో ఒకేసారి వినియోగించే ప్లాస్టిక్‌ (సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌)ను పూర్తిగా నిషేధించాలని డాక్టర్‌ సత్యనారాయణ మున్సిపల్‌ కమిషనర్లకు సూచించారు. మున్సిపాలిటీల్లో బొకేలు, ప్లాస్టిక్‌ వస్తువులకు బదులుగా జ్యూట్‌ బ్యాగులను వినియోగించాలని కోరారు. 


logo