గురువారం 09 జూలై 2020
Telangana - Apr 21, 2020 , 06:38:46

రాజన్న ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు

రాజన్న ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు

వేములవాడ  : లాక్‌డౌన్‌ కారణంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఆన్‌లైన్‌ సేవలు సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి.  స్వామివారికి గర్భాలయంలో అభిషేకం, అన్నపూజ, ఆకుపూజ, కుంకుమ పూజ, నిత్యకల్యాణం, సోమేశ్వరాలయంలో అభిషేకపూజ, అన్నపూజ, మహాలింగార్చన, సత్యనారాయణ వ్ర తం, శ్రీ భీమేశ్వరాలయంలో అభిషేకం, నవగ్రహ పూజలను జరిపించేందుకు ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. https:// meesevatelangana.gov.in లేదా గూగుల్‌ ప్లేస్టోర్‌లో  T APP FOLIO ద్వారా భక్తులు ఈ పూజలను బుక్‌ చేసుకోవచ్చని సూచించారు. భక్తుల గోత్రనామాలపై పూజలు జరిపిస్తామని అధి కారులు వెల్లడించారు.


logo