మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 22, 2020 , 10:53:30

బట్టలు విప్పించారు..బ్లాక్‌ మెయిలింగ్‌కు దిగారు..

బట్టలు విప్పించారు..బ్లాక్‌ మెయిలింగ్‌కు దిగారు..

హైదరాబాద్‌ : అశ్లీలంతో ఎర...రహస్య భాగాలు చూపించి...యువకులను రెచ్చగొడుతున్నారు..వారి వలలో పడగానే...బట్టలు విప్పిస్తున్నారు...దానిని రికార్డు చేసి...సోషల్‌ మీడియాలో పెట్టిన లింక్‌ను పంపిస్తున్నారు. అది తీసేయాలంటే లక్షలు డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే వైరల్‌ అంటూ హెచ్చరిస్తున్నారు. ఒక్కప్పుడు విదేశి సైబర్‌ క్రిమినల్స్‌ ముఠాలు ఈ విధంగా బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడగా ఇప్పుడు మన దేశానికి చెందిన సైబర్‌ ముఠాలు ఈ విధంగా సరికొత్త స్కెచ్‌ వేస్తున్నారు.దీని కోసం కొంత మంది దారి తప్పిన మహిళలను వారి ముఠాలో చేర్చుకుంటున్నారు. ఇలాంటి మోసాల బారిన పడి ఇప్పుడు సైబరాబాద్‌, రాచకొండ, హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లలో బాధితులు ఫిర్యాదులను నమోదు చేస్తున్నారు.ఈ మోసానికి డేటింగ్‌ సైట్‌లను వేదికగా చేసుకుని అమాయకులను నిండా ముంచుతున్నారు.కాబట్టి డేటింగ్‌ సైట్‌లలో సభ్యులుగా ఉండే వారు వాటి నుంచి బయట పడడం మంచిది. లేదంటే బ్లాక్‌ మెయిలింగ్‌కు గురై లక్షలు చెల్లించుకుని అవమాన భారాన్ని మోయాల్సిన పరిస్థితి మాత్రం కచ్చితంగా వస్తుందని సైబర్‌ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు.

బట్టలు విప్పించారు..బ్లాక్‌ మెయిలింగ్‌కు దిగారు..80 వేలు ఖాతాల్లో వేశాడు..

గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రాంతానికి చెందిన త్యాగి(పేరు మార్చాం) ఇటీవల విద్యాభ్యాసం పూర్తి చేసి కొత్తగా ప్రైవేటు ఉద్యోగంలో చేరాడు. అతను టైంపాస్‌ కోసం డేటింగ్‌ వెబ్‌సైట్‌లను చూస్తుంటాడు. పలు డేటింగ్‌ సైట్‌లలో సభ్యుడిగా చేరారు. ఇటీవల అతనికి ఓ యువతి చాటింగ్‌లో రహస్య విడియో చాటింగ్‌ చేద్దామని చెప్పింది. అలా చెప్పిన ఇద్దరు వెబ్‌ క్యామ్‌ ముందుకు వచ్చారు. మొదట యువతి తన మొహన్ని చూపించకుండా వస్త్రాలను తొలిగించిన రహస్య భాగాలను చూపిస్తూ చాటింగ్‌ చేసింది. అలా 15 నిమిషాల తర్వాత త్యాగిని కూడా బట్టలు విప్పాలని కోరింది. చాటింగ్‌ మాటలతో మాయలో మునిగిపోయిన త్యాగి బట్టలు విప్పేశాడు. అరగంటలో ఇద్దరీ విడియో చాటింగ్‌ ముగిసింది. మూడు గంటల తర్వాత త్యాగి ఫోన్‌కు ఓ లింక్‌తో కూడా సమాచారం వచ్చింది. దానిని క్లిక్‌  చేసి చూడగా బట్టలు లేకుండా అతను చేసిన విడియో చాటింగ్‌ రికార్డింగ్‌ మొత్తం కనిపించింది. కంగారుకు గురవుతున్న సమయంలో యువతి త్యాగితో చాటింగ్‌ చేసి ఈ లింక్‌ ఫేసుబుక్‌లో పెట్టాను. ఇది తొలగించాలంటే నాకు లక్ష రుపాయాలు కావాలని డిమాండ్‌ చేసింది. కంగుతిన్న త్యాగి నేను అంతా నగదును ఇవ్వలేను ప్లీజ్‌ ఆ విడియో ఫేసుబుక్‌ను తొలగించండని ప్రాధేయ పడ్డాడు. యువతి మాత్రం నాకు గంటలో లక్ష రుపాయాలు పంపియాలి లేదంటే వేలాది మందికి తెలిసేలా సోషల్‌ మీడియా వైరల్‌ చేస్తానని బెదిరించింది. చేసేది లేక త్యాగి 80 వేల రుపాయాలను యువతి సూచించిన ఖాతాల్లో వేసాడు. అప్పుడు యువతి ఫేసుబుక్‌ నుంచి ఆ విడియోను తొలగించింది. కాని భయంతో వణికిపోయిన టెన్షన్‌లో పదే పదే సోషల్‌ మీడియాను గాలిస్తూ హైరానా పడ్డాడు. 

సైబర్‌ ముఠాలోకి ఉత్తరాది రాష్ట్రాల మహిళలు...

తాజా ఫిర్యాదులను అధ్యయనం చేసిన సైబర్‌ క్రైం పోలీసులకు కొత్త విషయం తెలిసింది. కొంత మంది సైబర్‌ ముఠాలతో చేతులు కలిపి రాజస్థాన్‌, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, బెంగాల్‌ తదితర ఉత్తరాది రాష్ట్రాల మహిళలు ఇలాంటి ట్రాప్‌కు స్కెచ్‌లు వేస్తున్నారు.దీని కోసం వారు అభ్యంతకరమైన దృశ్యాలతో విడియో చాటింగ్‌లను చేయడానికి సిద్ధపడి వారి ఎత్తుకు చిక్కిన వారిని బట్టలు విప్పించి దానిని రికార్డు చేసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని తేలింది. ఫిర్యాదు దారులు ఇచ్చిన వివరాలు, వారు నగదును డిపాజిట్‌ చేసిన ఖాతాలను పరిశీలించినప్పుడు అవి ఉత్తరాది రాష్ట్రాలలోని బ్యాంక్‌ల ఆచూకీ దొరికింది. వారిని పట్టుకునేందుకు పోలీసులు ఓ ప్రణాళిక బద్ధంగా ఈ ముఠా గుట్టును రట్టు చేయనున్నారు. కరోనా బెడద తీరిని తర్వాత సైబర్‌ క్రైం పోలీసులు ఈ కొత్త తరహా మోసం కీలకంగా మారిన మహిళలను అరెస్టు చేయనున్నారు.అయితే గతంలో ఇలాంటి మోసాలకు విదేశి సైబర్‌ క్రిమినల్స్‌ ముఠాలోని మహిళలు చేసే వారు. ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల వారు ఉండడంతో డేటింగ్‌ చాటింగ్‌ ప్రియులు వారి మాయకు చిక్కి ఆర్థిక కష్టాలను తెచ్చుకునే అవకాశం ఉందని ఓ సీనియర్‌ సైబర్‌ క్రైం పోలీసు అధికారి వివరించారు. అందుకే గుర్తు తెలియని వారితో డేటింగ్‌ చాటింగ్‌ చేయడం డేంజర్‌ అని గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నారు.  


logo
>>>>>>