శనివారం 11 జూలై 2020
Telangana - Jun 16, 2020 , 00:27:02

ఇంటర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు!

ఇంటర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు!

  • మండలాలవారీగా విద్యార్థుల వివరాలు సేకరణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు అందుబాటులోకి తీసుకురావాలని  ఇంటర్‌ బోర్డు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే నారాయణఖేడ్‌, సరూర్‌నగర్‌, యాదగిరిగుట్ట కాలేజీల్లో ఆన్‌లైన్‌ పాఠాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, త్వరలో అన్ని కాలేజీల్లో అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. విద్యార్థులు కూడా ఆన్‌లైన్‌ పాఠాలవైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. స్మార్ట్‌ఫోన్లు కలిగి ఉన్న విద్యార్థుల వివరాలను మండలాలవారీగా సేకరిస్తున్నామని, ఆ మేరకు వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటుచేస్తున్నామని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ప్రిన్సిపాళ్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణకుమార్‌ తెలిపారు. 


logo