శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 10, 2020 , 18:59:32

వాసాలమర్రిలో కొనసాగుతున్న గ్రామ భౌగోళిక సర్వే

వాసాలమర్రిలో కొనసాగుతున్న గ్రామ భౌగోళిక సర్వే

యాదాద్రి భువనగిరి : సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామం వాసాలమర్రిలో గత రెండు రోజులుగా గ్రామ భౌగోళిక సర్వే పనులను సర్వే బృందం సభ్యులు నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో గ్రామ భౌగోళిక స్వరూపం పూర్తిగా నమోదు అవుతుంది. ఇండ్ల వైశాల్యం గ్రామంలోని ఖాళీస్థలాలు రోడ్లు, చెట్లు తదితర పూర్తి అంశాలను సర్వే చేసి బ్లూప్రింట్‌ను తయారుచేయనున్నారు. వాసాలమర్రిని ఎర్రవల్లిలా అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు అధికారులు గ్రామ సమగ్ర సర్వే పనులను ముమ్మరం చేశారు.