శనివారం 30 మే 2020
Telangana - Mar 30, 2020 , 06:27:08

కొనసాగుతున్న ఉపరితల ద్రోణి, ఆవర్తనం

కొనసాగుతున్న ఉపరితల ద్రోణి, ఆవర్తనం

హైదరాబాద్ : ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఆదివారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిశాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. సోమవారం కూడా ఇదే తరహా వాతావరణం ఉండే అవకాశం ఉన్నదని చెప్పారు. ఉత్తర కేరళ నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ వరకు ఇంటీరియర్‌ కర్ణాటక, మరాఠ్వాడ, విదర్భ మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితలద్రోణి కొనసాగుతున్నదని పేర్కొన్నారు. శ్రీలంక నైరుతి బంగాళాఖాతం ప్రాంతాల్లో సముద్రమట్టానికి 0.9 కి.మీ. నుంచి 1.5 కి.మీ. మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదన్నారు.  హైదరాబాద్‌లో ఎండలు మండుతున్నాయి. ఈనెల 26న 37 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, ఆదివారం 37.2 డిగ్రీలుగా రికార్డయింది. 


logo