సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Aug 26, 2020 , 02:29:38

కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం

కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం

  • నేడు అక్కడక్కడ తేలికపాటివానలు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం మంగళవారం ఉదయం అదే ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. ఉత్తర-దక్షిణ ద్రోణి రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్నది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో బుధవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. గురువారం ఓ మోస్తరు వర్షాలతోపాటు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు పేర్కొన్నారు.


logo