శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 08:43:13

కృష్ణా ప్రాజెక్టులకు కొనసాగుతున్న భారీ వరద

కృష్ణా ప్రాజెక్టులకు కొనసాగుతున్న భారీ వరద

హైదరాబాద్‌ : పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. నది పరీవాహక ప్రాంతాలతో పాటు ఎగువన కురిసిన వర్షాలకు భారీగా వరద వస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టుల నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకోగా వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. జూరాలకు ప్రియదర్శిని డ్యామ్‌కు భారీగా వరద వస్తోంది. 3.86లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నది. డ్యామ్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1402 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ఇప్పుడు 8.933 టీఎంసీల నిల్వ ఉంది. ఇప్పటికే డ్యామ్‌ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో అధికారులు 42 క్రస్ట్‌ గేట్లను ఎత్తి 3,69,690 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు 3,69,776 క్యూసెక్కుల భారీ ప్రవాహం వస్తుంది. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 589 అడుగులు ఉండగా పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం నీటి నిల్వ 309.64 టీఎంసీల నీరుండగా పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు. ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండడంతో అధికారులు 18 క్రస్ట్‌ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు 3,69,776 క్యూసెక్కులు వదులుతున్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.