సోమవారం 19 అక్టోబర్ 2020
Telangana - Oct 17, 2020 , 19:16:13

మిడ్‌మానేరుకు కొనసాగుతున్న వరద

మిడ్‌మానేరుకు కొనసాగుతున్న వరద

సిరిసిల్ల : మధ్య మానేరు జలాశయానికి వరద కొనసాగుతోంది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుతో పాటు మానేరు నది నుంచి వరద వచ్చి ప్రాజెక్టులో చేరుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు గరిష్ఠ స్థాయికి చేరడంతో నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318 మీటర్లు కాగా, ప్రస్తుతం 317.34 మీటర్ల మేర నీరుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థం 27.5 టీఎంసీలు కాగా, 25.861 టీఎంసీల మేర నీరుంది. ప్రాజెక్టుకు శ్రీరాంసాగర్‌, మానేరు నది ద్వారా 6594 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో నాలుగు రేడియల్‌ గేట్లను అధికారులు ఎత్తి 9914 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo