సోమవారం 26 అక్టోబర్ 2020
Telangana - Sep 20, 2020 , 10:34:46

సింగూరు జలాశయానికి కొనసాగుతున్న వరద

సింగూరు జలాశయానికి కొనసాగుతున్న వరద

సంగారెడ్డి : ఎగువన కురుస్తున్న వర్షాలతో సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్‌ జలాశయానికి ఇన్‌ఫ్లో స్ధిరంగా కొనసాగుతుంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా  ప్రస్తుతం 16.72 టీఎంసీలకు చేరింది. ఎగువ నుంచి  19,032 క్యూసెక్కుల వరద వస్తోంది. 120 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 523.6 మీటర్లు కాగా ప్రస్తుతం 520.5 మీటర్లకు చేరింది. ప్రవాహం ఇలాగే కొనసాగితే మరోనాలుగైదు రోజుల్లో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరే అవకాశం ఉంది. 

శ్రీరాంసాగర్‌కు లక్ష క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో.. 25 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. 1,23,427 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా అంతే ప్రవాహాన్ని 25 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ఇప్పటికే పూర్తిస్థాయిలో నిండింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo