శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 20, 2020 , 07:41:13

శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

హైదరాబాద్‌ : శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 4,01,818 క్యూసెక్కుల భారీ వరద వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు పది గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. అవుట్‌ ఫ్లో 4,96,497గా ఉంది. అలాగే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 883.80 అడుగులకు చేరింది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకు.. ప్రస్తుతం నీటి నిల్వ 208.72 టీఎంసీలుగా నమోదు అయ్యింది. మరోవైపు కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. వర్షాలు ఇంకా కొనసాగితే మరింత వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.