శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Aug 27, 2020 , 08:49:13

శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

న్యూఢిల్లీ : శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ఇప్పటికే జలాశయం నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరింది. దీంతో అధికారులు ఎనిమిది గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయానికి 2,26,751 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 2,54,434 క్యూసెక్కులు దిగువకు వదిలారు. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, పూర్తిస్థాయిలో 884.80 అడుగులకు నీటిమట్టం చేరింది. నీటి సామర్థ్యం 215.81 టీఎంసీలకుగాను 214.363 టీఎంసీల నీరుంది. కుడిగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. అలాగే నాగార్జునసాగర్‌కు వరద వస్తోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తారు. ప్రాజెక్టుకు 2,20,434 ఇన్‌ఫ్లో వస్తుండగా, 2,20,143 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, 589.30 అడుగుల మేర నీరుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 312.05 టీఎంసీలు కాగా, 309.34 టీఎంసీల నిల్వ ఉంది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo