మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 28, 2020 , 10:17:38

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

నాగార్జునసాగర్‌  ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

నల్గొండ: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరద నీరు ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590.00 అడుగులు కాగా ప్రస్తుతం 542.60 అడుగుల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 40,252 క్యూసెక్కుల నీరు వస్తుండగా 1500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 193.7880 టీఎసీల నీరు ఉంది. కాగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది ప్రాజెక్టుకు 42.369 నీరు వస్తుండగా, 40.254 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo