శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 15, 2020 , 08:59:47

నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న వరద.. 14 గేట్లు ఎత్తి దిగువకు నీటివిడుదల

నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న వరద.. 14 గేట్లు ఎత్తి దిగువకు నీటివిడుదల

నల్లగొండ : ఎగువ నుంచి నాగార్జున సాగర్‌ జలాశయానికి భారీగా ఇన్‌ఫ్లో వస్తోంది. జూరాల నుంచి శ్రీశైలానికి లక్షా 37 వేల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో వస్తుండటం.. ఇప్పటికే శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయిలో నిండటంతో డ్యామ్ 9 క్రస్టు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2 లక్షల 80 వేల క్యూసెక్కులకుపైగా స్పిల్‌ వే ద్వారా నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు (215.8) టీఎంసీలు) కాగా ప్రస్తుతం 884.58 అడుగులు(212.91) టీఎంసీలుగా ఉంది. నాగార్జున సాగర్‌ జలాశయం సైతం పూర్తిగా నిండటంతో 14 క్రస్టుగేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2 లక్షల 9 వేల క్యూసెక్కులను దిగువ పులిచింతలకు విడుదల చేస్తున్నారు. కుడికాల్వ, ఎల్‌ఎల్‌బీసీ, వరద కాల్వ, విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ద్వారా 39 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.4 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 589.90 అడుగులు (311.74) టీఎంసీలుగా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.



logo