శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 10:07:02

కృష్ణా ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద

కృష్ణా ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద

హైదరాబాద్‌ : కృష్ణా ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. గతవారంలో కురిసిన వర్షాలకు ప్రాజెక్టులకు ఇంకా ప్రవాహం వస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రియదర్శి డ్యామ్‌కు ప్రస్తుతం 93,496 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు గరిష్ఠ మట్టానికి చేరుకోవడం అధికారులు స్పిల్‌వే గేట్లు ఎత్తి దిగువకు 60,376 క్యూసెక్కుల వదులుతున్నారు. అలాగే ఎల్‌ఎంసీకి, ఆర్‌ఎంసీ, సమాంత కాలువకు 750 క్యూసెక్కులు, బీమా లిఫ్ట్‌కు 856 క్యూసెక్కులు విడుదల చేశారు. అలాగే శ్రీశైల డ్యామ్‌కు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టుకు 50,261 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. నాలుగు గేట్లను పది అడుగుల మేర ఎత్తారు. ప్రస్తుతం జలాశయం నుంచి 2,05,284 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు 884.8 అడుగుల మేర నీరుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలకు ప్రస్తుతం 218.84 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమగట్లలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు 1,67,791 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు 8 క్రస్ట్‌ గేట్లను పది అడుగుల మేర ఎత్తి 1,61,791 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం డ్యామ్‌లో 311.44 టీఎంసీ మేర నీరు నిల్వ ఉంది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

తాజావార్తలు