ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 18, 2020 , 01:53:12

ఏ ఆంధ్రా ఉద్యోగినీ ఒప్పుకోం

ఏ ఆంధ్రా ఉద్యోగినీ ఒప్పుకోం

  • విద్యుత్‌ సంస్థల్లో కొనసాగుతున్న ఆందోళన

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రాష్ట్ర విద్యుత్‌ సంస్థల్లో ఆంధ్రాప్రాంత ఉద్యోగులను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగసంఘాలు పునరుద్ఘాటించాయి. ధర్మాధికారి ఉత్తర్వుల పేరుతో, ఇతర కారణాలతో ఆంధ్రా ఉద్యోగులు ప్రవేశించాలని యత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయ ని హెచ్చరించాయి. 584 మంది ఉద్యోగులను ఏపీ విద్యుత్‌ సంస్థలు రిలీవ్‌ చేయడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులు మంగళవారం సైతం తమ నిరసనలను కొనసాగించారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ జేఏసీ, తెలంగాణ పవర్‌ ఎంప్లాయీస్‌ జేఏసీల నేతృత్వంలో వేర్వేరుగా రిలే నిరాహారదీక్షలు నిర్వహించారు. ఖైరతాబాద్‌లోని విద్యుత్‌సౌ ధ, మింట్‌కంపౌండ్‌లోని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ కార్యాలయాల ఎదుట ఆందోళనలు నిర్వహించారు. ఆందోళనలు కొనసాగుతుండగానే.. ఏపీ నుంచి రిలీవైన ఉద్యోగులు కొందరు విద్యుత్‌సౌధలోని ప్రవేశించేందుకు యత్నిస్తుండగా తెలంగాణ ఉద్యోగులు అడ్డుకున్నారు. దీంతో ఏపీ ఉద్యోగులు వెనుదిరిగిపోయారు. 


logo