బుధవారం 03 మార్చి 2021
Telangana - Jan 23, 2021 , 00:15:48

వంద రోజుల్లో వెయ్యి కంటి శస్త్రచికిత్సలు

వంద రోజుల్లో వెయ్యి కంటి శస్త్రచికిత్సలు

  • జగిత్యాల ఎమ్మెల్యే, నేత్రవైద్య నిపుణుడు సంజయ్‌కుమార్‌

జగిత్యాల, జనవరి 22(నమస్తే తెలంగాణ): ‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం.. కానీ, చాలామంది ముఖ్యంగా పేదలు కంటి సమస్యలు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా చిన్న చిన్న సమస్యలే చూపు కోల్పోయే పరిస్థితికి కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జగిత్యాల నియోజకవర్గ పరిధిలో రానున్న వందరోజుల వ్యవధిలో వెయ్యి శస్త్రచికిత్సలు ఉచితంగా నిర్వహిస్తున్నట్టు జగిత్యాల ఎమ్మెల్యే, నేత్రవైద్య నిపుణుడు డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ ప్రకటించారు. ప్రజా జీవితంలో బిజీగా ఉన్నప్పటికీ ఇప్పటికే కొన్ని ఆపరేషన్లు కూడా నిర్వహించారు. ముఖ్యంగా కాటరాక్ట్‌, గ్లకోమా, తదితర వ్యాధులకు శస్త్ర చికిత్సలు చేయనున్నారు. ‘ప్రజాజీవితంలో బిజీగా ఉన్నప్పటికీ, సమయం దొరికితే దవాఖానకు వచ్చి రోగుల సేవకే వెచ్చిస్తాను. ఈ క్రమంలోనే ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం ఏర్పడింది. ముందుగా వెయ్యి చికిత్సలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. వంద రోజుల వ్యవధిలో వీటిని పూర్తి చేయాలని భావిస్తున్నా. రోటరీ క్లబ్‌, ఆపీ స్వచ్ఛందసంస్థలు సహకరిస్తున్నాయి. కార్యక్రమంలో మా దవాఖాన వైద్యుడు, ప్రతిమ దవాఖాన నేత్రవైద్య నిపుణులు సైతం భాగం కానున్నారు’ అని ఎమ్మెల్యే సంజయ్‌ తెలిపారు.

VIDEOS

logo