గురువారం 09 జూలై 2020
Telangana - Jun 16, 2020 , 12:59:31

ఐదు రోజుల్లో వెయ్యి కరోనా కేసులు

 ఐదు రోజుల్లో వెయ్యి కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ప్రతిరోజూ వందల కొద్దీ కేసులు నమోదవుతుండడంతో నాలుగు రోజుల్లోనే ఆ సంఖ్య వెయ్యికి చేరుకుంది. జూన్‌ ౩ వరకు రాష్ట్రంలో కరోనా కేసులు ౩వేలు దాటాయి.  10వ తేదీన ఆ సంఖ్య 4 వేలకు చేరుకుంది. నిన్నటి 219 కేసులతో కలిపి ఐదు రోజుల్లోనే మొత్తం వెయ్యి కేసులు నమోదయ్యాయి. మూడు నుంచి నాలుగు వేల కరోనా కేసులు నమోదు కావడానికి 7 రోజులు పట్టగా.. నాలుగు నుంచి ఐదు వేలకు చేరుకోవడానికి కేవలం 5 రోజులే పట్టింది. ఈ లెక్కలను బట్టి చూస్తే రాష్ట్రంలో కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. 

రానున్న రోజుల్లో అతి తక్కువ సమయంలో వేలల్లో కేసులు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. మరణాల సంఖ్య కూడా నెమ్మదిగా పెరుగుతుండడంతో జనం ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కరోనా వల్ల సగం కంపెనీలు ఉద్యోగులకు లే ఆఫ్‌ ప్రకటించగా.. మిగిలిన వ్యాపారాలు కూడా నష్టాలతో సతమతమవుతున్నాయి.  ప్రభుత్వం ప్రైవేట్‌ దవాఖానల్లో కూడా కరోనా టెస్టులు, చికిత్సకు అనుమతి ఇవ్వడంతో అనుమానితులు పెద్ద ఎత్తున వెళ్లి టెస్టులు చేయించుకుంటున్నారు. 


logo