గురువారం 04 మార్చి 2021
Telangana - Jan 17, 2021 , 01:40:19

ప్రాణం తీసిన నల్లానీటి గొడవ

ప్రాణం తీసిన నల్లానీటి గొడవ

  • తండ్రి మృతి.. కుమారుడికి గాయాలు

రాంనగర్‌, జనవరి 16: పబ్లిక్‌ నల్లా వద్ద నీటికోసం రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ ఒకరి ప్రాణం తీసింది. ఈ ఘటన కరీంనగర్‌ రూరల్‌ మండలం నగునూర్‌ గ్రామంలో శనివారం చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామా నికి చెందిన మరిశెట్టి రాములు (60) వ్యవసాయం చేస్తూ జీవిస్తుంటాడు. ఇతనికి ఇద్దరు కొడుకులు సాగర్‌, రాజు ఉన్నారు. ఇంటి వద్దే ఉన్న పబ్లిక్‌ నల్లా వద్ద రోజూ నీటిని పట్టుకుంటారు. శనివారం ఉదయం నీళ్ల కోసం పైప్‌ వేసుకున్నారు. అదే సమయంలో రాములు ఇంటి పక్కనే ఉన్న అబ్దుల్‌ హమీద్‌ కుటుంబ సభ్యులు కూడా నీళ్లు పట్టుకునేందుకు అక్కడికి వచ్చారు. రాములు బిగించిన పైపును తొలగించి వారి పైపు పెట్టుకున్నారు. ఈ విషయం లో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. హమీద్‌ కుటుంబ సభ్యులు రాములు, అతని కొడుకు రాజుపై దాడి కి దిగారు. ఘటనలో రాములు స్పృహ కోల్పోయాడు. దవాఖానకు తరలించే సరికి మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. రాజుకు స్వల్ప గాయాలయ్యాయి. రాములు పెద్దకొడుకు సాగర్‌ ఫిర్యాదు మేరకు హమీద్‌ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.  

VIDEOS

logo